Saturday, June 10, 2017

కొబ్బరి  మామిడికాయ  పచ్చడి.

కొబ్బరి  మామిడికాయ  పచ్చడి.
ఆలూరుకృష్ణప్రసాదు .


సింపుల్  గా  కొబ్బరి  మామిడికాయ  పచ్చడి ఎలా చెయ్యాలో తెలుసుకుందాము.
ఒక  చిప్ప  పచ్చి  కొబ్బరి   తురుముకోండి.
ఒక పుల్లని మామిడి  కాయ  చెక్కు తీసి ముక్కలుగా  తరగండి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి ఆరు ఎండుమిరపకాయలు , పావు స్పూను  మెంతులు , స్పూను మినపప్పు , పావు స్పూను  జీలకర్ర  అర స్పూను  ఆవాలు  కాస్త  ఇంగువ  కాస్త  కరివేపాకు   వేసి  పోపు  వేయించుకోండి .
తర్వాత  పోపు  మిక్సీలో  వేసి  కాస్త పసుపు , మూడు పచ్చిమిర్చి , తగినంత  ఉప్పు   వేసి  మెత్తగా  వేసుకుని  తర్వాత  మామిడి  ముక్కలు , కొబ్బరి  తురుము  వేసి  తిప్పుకోండి.
కొబ్బరి  మామిడి కాయ  పచ్చడి  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి